Kohli 100 Centuries: 100 సెంచరీలు చేసే సత్తా విరాట్ కోహ్లీకి ఉంది: సునీల్ గవాస్కర్
- మరోసారి విరాట్ కోహ్లీని ప్రశంసించిన సునీల్ గవాస్కర్..
- సచిన్ 101 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది..
- మరో మూడేళ్లు కోహ్లీ క్రికెట్ ఆడితే, 100 శతకాలు కొట్టేస్తాడు: సునీల్ గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli 100 Centuries: భారత క్రికెట్ లెజెండర్ సునీల్ గవాస్కర్ మరోసారి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే 100 శతకాలు పూర్తి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 సెంచరీలు ఉన్నాయి.. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని భావించినప్పటికీ, మధ్యలో కొంతకాలం ఫాంలో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. కానీ, టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.. అయినప్పటికీ అతడి ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని, 100 శతకాల మైలు రాయిని చేరుకోవడం సాధ్యం అవుతుందని గవాస్కర్ అన్నారు.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
అయితే, కోహ్లీ మరో మూడేళ్లు ఆడితే 16 శతకాలను ఈజీగా కొడతాడు అని గవాస్కర్ తెలిపారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు చేశాడు.. ఇలాగే ఆడితే న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో మరో రెండు శతకాలు కొడితే 87కి చేరిపోతాడని పేర్కొన్నాడు. కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, క్రికెట్‌ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని వెల్లడించారు.
Read Also: Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
ఇక, విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 30 సెంచరీలు చేశాడు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేయగా.. టీ20ల్లో ఒక శతకం చేయగా, వన్డేల్లో 53 శతకాలను కొట్టాడు. అయితే, సచిన్ టెండూల్కర్ 51 టెస్ట్, 49 వన్డే శతకాలతో మొత్తం 101 అంతర్జాతీయ శతకాలతో రిటైర్ అయ్యాడు. సచిన్ 24 ఏళ్ల కెరీర్‌లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, కోహ్లీ 2008 నుంచి ఇప్పటి వరకు 556 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, విరాట్ కోహ్లీ 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో మళ్లీ ఆడనున్నాడు. భారత్–న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నందున, వీరు ఇద్దరు ఈ సిరీస్‌లో తిరిగి ఆడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!