శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా.. నల్లచెరువులోని క్రికెట్ స్టేడియంలో క్షుద్ర పూజలు చేశారు.. క్రికెట్ స్టేడియంలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసినట్టు అనవాళ్లు కనిపిస్తున్నాయి.. క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండగా క్షుద్ర పూజలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
Occult Worship: పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో గల ఓ హస్టల్ లో దారుణం జరిగింది. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షిస్తుందని ఓ హాస్టల్ వంట మనిషి పేద విద్యార్థులకు ఎర వేసింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపిన ఆమె నగ్న పూజలకు సహకరించాలని కోరినట్లు సమాచారం?.
పూజల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధాంతి అముదాలపల్లి వెంకటాచార్యులు ఘరానా మోసం చేశారు. పెనుమంట్ర మల్లెపూడి గ్రామానికి చెందిన పెచ్చేటి గోపాలకృష్ణకు క్షుద్ర పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని అతని కుటుంబ సభ్యులను బోల్తా కొట్టించాడు. రూ. 37లక్షల 50 వేలు టోకరా వేశాడు సిద్ధాంతి.
Medak Crime: సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి.
Occult Worship: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి..
Occult Worship: హైదరాబాద్ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో దానికి కారణం క్షుద్రపూజలే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Occult worship: ఇది డిజిటల్ యుగం. టెక్నాలజీని అందిపుచ్చుకుని మనిషి అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అయినప్పటికీ, కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఏలూరు జిల్లా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. కైకలూరు మండలం వేమవరం పాడు గ్రామంలో రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చెరువుపై పూజ చేసుకుంటుండగా క్షుద్ర పూజ అనే అనుమానంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.