‘మన బలహీనతే ఎదుటి వారి బలం’.. మోసగాళ్ల సూత్రం ఇదే. ఎదుటి వారి బలహీనతను గ్రహించి వారి దగ్గర నుంచి ఏదో రూపంలో దోచేస్తుంటారు. ఇక.. క్షుద్ర పూజల పేరుతో జరుగుతున్న మోసాలకు అంతే లేకుండా పోతుంది. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు బాధితులు వారు అడిగినంత అప్పజెప్పుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Read Also: Gary Kirsten: మాట వినరు? మద్దతు తెలపరు.. పాకిస్థాన్ క్రికెట్ కోచ్ రాజీనామా
పూజల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధాంతి అముదాలపల్లి వెంకటాచార్యులు ఘరానా మోసం చేశారు. పెనుమంట్ర మల్లెపూడి గ్రామానికి చెందిన పెచ్చేటి గోపాలకృష్ణకు క్షుద్ర పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని అతని కుటుంబ సభ్యులను బోల్తా కొట్టించాడు. రూ. 37లక్షల 50 వేలు టోకరా వేశాడు సిద్ధాంతి. కాగా.. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు మొగల్తూరు పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Stock market: వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్