NVSS Prabhakar: గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని NVSS ప్రకభార్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయి, పడిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ను తరిమికొట్టారని తెలిపారు. మహబూబ్ నగర్ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ను ఓడించారన్నారు. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో రేవంత్ రెడ్డి పాత్ర నామమాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ గెలిచిన ఒక్క సీటులో కూడా రేవంత్ రెడ్డి ప్రభావాన్ని చూపించలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలన్నారు. కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిందన్నారు.
Read also: Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లి మైదానంలో విస్తృత ఏర్పాట్లు
కల్తీ విత్తనాలు, విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు మానుకుని పాలనపైన దృష్టి పెట్టాలన్నారు. గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని అని అన్నారు. ఖమ్మం, మహబూబ్ బాద్, నల్గొండ, భువనగిరిలో తమ వల్లే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని కమ్యూనిస్టులు చెబుతున్నారన్నారు. డిసెంబర్ 9వరకైనా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలని తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనను తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు పోయిందనేది ఎవ్వరికీ తెలియదన్నారు. బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వాలను నడపడం కొత్తేమీ కాదన్నారు. ఏపీలో కూటమి విజయం సాధించడం అభినందనియమని తెలిపారు.
Teachers Transfer: టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఉత్తర్వులు నిలిపివేత