NVSS Prabhakar: ధాన్యం కొనుగోలు అవినీతిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమీక్షలకు సంబంధిత మంత్రులు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారని తెలిపారు. మంత్రి వర్గ కూర్పులో ముఖ్యమంత్రి నామ్ కే వాస్త్ గా ఉన్నారని తెలిపారు. డిల్లీకి కప్పం కట్టేందుకే మంత్రివర్గం ఉన్నట్లు ఉందన్నారు. ధనిక రాష్ట్ర ఆస్తులు తరుగుతున్నాయి.
Read also: Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!
మంత్రుల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. సివిల్ సప్లై శాఖను ఆ రోజు BRS, ఈ రోజు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలులో జరిగే అవినీతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఒక్కో దశ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ వెళ్లే విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాకు నీవు.. నీకు నేను అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Canara Bank: బ్యాంకులో బంగారం గోల్ మాల్.. బ్యాంక్ అధికారి చేతివాటం..
మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న విషయం తెలిసిందే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్ లో మాట్లాడుతున్న రేవంత్ నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ హాజరుపై ఏఐసీసీ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్న కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!