జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడని వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నర్సింగ్ కాలేజ్ నుంచి హాస్టల్ కు వెళ్లే క్రమంలో బస్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు…
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ విద్యార్థులు గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించారు. బోయగూడలోని నర్సింగ్ కళాశాల, హాస్టల్లో డ్రైనేజీ సమస్య మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మురుగు వ్యవస్థ అద్వాన్నంగా తయారై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్టైఫండ్ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు పెంచగా, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి…