Donald Trump: భారత్- పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి ఇవే కామెంట్స్ చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, యూఎస్ ప్రెసిడెన్షియల్ “డూమ్స్‌డే ప్లేన్” లేదా E-4B “నైట్‌వాచ్” వాషింగ్టన్ DC సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ల్యాండ్ అయింది. అణు యుద్ధం లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఈ విమానాన్ని సాధారణంగా అమెరికా అధ్యక్షుడు లేదా అగ్ర సైనిక నాయకత్వం ఉపయోగిస్తారు. ఇది సైనిక విశ్లేషకులు, విమానయాన ట్రాకర్లలో ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నైట్‌వాచ్ విమానం అధునాతన కమ్యూనికేషన్ గేర్‌ను కలిగి ఉంది.…
ఫ్రాన్స్‌లో 'చిడో' తుఫాను విధ్వంసం సృష్టించింది. మయోట్ ప్రాంతంలో తుఫాను కారణంగా వందలాది మంది మరణించారు. అణుదాడి తర్వాత జరిగిన విధ్వంసంలా చాలా ప్రాంతాల్లో విధ్వంస దృశ్యాలు నెలకొన్నాయి. తుఫాను దాటికి చాలా రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడింది. అలాగే.. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య వేలకు చేరుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్‌యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.
Nuclear War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దళాలు ప్రవేశించాయి. అమెరికా, ఫ్రెంచ్ మెరైన్ కమాండోలు నేరుగా ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రవేశించారని.. ఇప్పుడు NATO వైమానిక దళ పైలట్లు కూడా సైనిక కార్యకలాపాలను ప్రారంభించవచ్చని రష్యన్ ఇంటెలిజెన్స్ నివేదించింది.
అమెరికాకు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది. కానీ ఈసారి మాత్రం రష్యా ఎన్నికల ముందు అగ్రరాజ్యం అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను…