Putin: ఉక్రెయిన్‌కు మద్దతిస్తే జరిగేది అణు యుద్ధమే.. అమెరికాకు తాజా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది. కానీ ఈసారి మాత్రం రష్యా ఎన్నికల ముందు అగ్రరాజ్యం అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని స్పష్టం చేశారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
సాంకేతికంగా అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉందని.. కానీ అందుకు తొందరపడటం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే.. యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్లేనని.. దానికి తప్పకుండా బదులిస్తామని హెచ్చరించారు.
ఇక ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే.. రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి మద్దతుగా నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని, ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమదేశాలను పుతిన్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!