ప్రధాన మంత్రితో పోల్చితే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతారణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 1969, 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తరువాత ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయి. అధికార ఎన్‌డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం అని చెప్పవచ్చు. 2017ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు…
సాధారణంగా పెళ్లంటే పెళ్లి కొడుకు తాళి కట్టాలి కానీ అక్కడ మాత్రం పెళ్లి కూతురు కూడా తాళి కట్టాల్సిందే. అది అక్కడి ఆచారం. అంతేకాదు పెళ్ళికొడుకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని మెడలో నోట్ల దండ వేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అది కూడా ఆ ఊరి ఆచారం. అంతేకాదండోయ్ ఒకే రోజు ఒకే ముహూర్తానికి వందల పెళ్లిళ్లు జరుగుతాయి. ఇది ఎక్కడ వింత ఆచారం తంతు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే.. సహజంగా…
ప్రధాని నరేంద్ర మోడీ తాను మూడోసారి ప్రధాని కావటంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూడవసారి ఏం ఖర్మ..ఎన్నిసార్లయినా కావచ్చు అనేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ప్రధాని మోడీ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు.. వితంతువులు ..పేద ప్రజలతో మోడీ రెండు రోజుల క్రితం వర్చువల్ గా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత ఒకరు తనను కలిసి మోడీజీ..…
రెండేళ్లుగా కరోనా నుంచి బారినపడకుండా తనను తాను రక్షించుకున్న ఉత్తర కొరియాలో ప్రస్తుతం మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. గురువారం రాజధాని ప్యోంగాంగ్‌లో తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి వనుంచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఆదివారం ఉత్తర కొరియా అధికార మీడియీ కరోనా వ్యాప్తికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. కేవలం…
పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. పాలక రాజపక్స కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక దుస్థితికి రాజపక్సలే కారణం అంటూ గత కొన్ని నెలలుగా లంక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, విద్యుత్ కోతలు, ఇందన కొరత, నిత్యావసరాల లేమితో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ప్రజలు ఒక్కసారిగా పాలకవర్గం మీద తిరగబడ్డారు. వీధుల్లోకి వచ్చి నిరసనల ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల…
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూలు స్వాతి ఎపిసోడ్ దారుణాతి దారుణం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్వాతిలు జైళ్లకు వెళ్తున్నారు. చరిత్రకెక్కుతున్నారు. ప్రియుడి కోసం భర్తలనే హతమారుస్తున్నారు. కుటుంబాలను నడివీధికి తెచ్చుకుంటున్నారు. పిల్లలను అనాధలను చేస్తున్నారు. ఎందుకిలా..అసలు వీళ్లకేమైంది. ప్రియుడితో సుఖం పొందడానికి భర్తలను చంపుతున్న భార్యలకు స్వాతి ఎపిసోడ్‌ను మించిన ఎగ్జాంపుల్ ఉండదేమో..…