ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూలు స్వాతి ఎపిసోడ్ దారుణాతి దారుణం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్వాతిలు జైళ్లకు వెళ్తున్నారు. చరిత్రకెక్కుతున్నారు. ప్రియుడి కోసం భర్తలనే హతమారుస్తున్నారు. కుటుంబాలను నడివీధికి తెచ్చుకుంటున్నారు. పిల్లలను అనాధలను చేస్తున్నారు. ఎందుకిలా..అసలు వీళ్లకేమైంది.
ప్రియుడితో సుఖం పొందడానికి భర్తలను చంపుతున్న భార్యలకు స్వాతి ఎపిసోడ్‌ను మించిన ఎగ్జాంపుల్ ఉండదేమో.. అయినా.. మహిళలు ఎందుకిలా చేస్తున్నారు. వీళ్లకేమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్ స్వాతి ప్రస్తుతం నరకం లాంటి జీవితాన్ని గడుపుతోంది. ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేయించింది. మరి ఆ వ్యక్తితోనైనా సుఖంగా ఉందా అంటే అదీ లేదు. ఇద్దరూ జైలుపాలయ్యారు. ఇక స్వాతి తల్లిదండ్రులు కూడా ఆమెను దగ్గరకు తీయడం కాదు కదా ఆమె పిల్లల్ని కూడా అప్పగించడం లేదు. ఇలా భర్త, ప్రియుడు, తల్లిందండ్రులు, పిల్లలు దూరమవడమే కాదు సమాజంలో.. భర్తలను చంపిన, చంపుతున్న భార్యలకు బ్రాండెడ్ నిందితురాలిగా గుర్తింపు పొందిన స్వాతి ప్రస్తుతం స్టేట్ హోంలో ఓ అనాథలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది.
ప్రియుడి మోజులో పడి భర్త శ్రీనివాస్ రెడ్డిని కిరాతకంగా హతమార్చిన స్వాతి ఆ తర్వాత ఓ నాటకానికి తెరలేపింది. భర్త స్థానంలో ప్రియుడిని తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేసింది. ప్రియుడి ప్లాస్టిక్ సర్జరీ కోసం లక్షలు ఖర్చు పెట్టింది. చివరకు ఈ నాటకం బైటపడి స్వాతితో పాటు ప్రియుడు రాజేష్ కూడా కటకటాలపాలైన విషయం తెలిసిందే. తమ కూతురు చనిపోయినట్లుగా భావిస్తున్నట్లు చెబుతున్న స్వాతి తల్లిదండ్రులు ఆమె ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల స్వాతికి బెయిల్ లభించడంతో పిల్లలతో కలిసి బతకాలనుకుంది. కానీ ఆమెకు పిల్లల్ని అప్పగించే ప్రసక్తే లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియని స్వాతిని పోలీసులు స్టేట్ హోంకు తరలించి విషయం తెలిసిందే.
దీంతో అప్పటినుంచి స్వాతి అక్కడే ఉంటోంది. తల్లిదండ్రులు, కన్న బిడ్డలు ఉన్నప్పటికి తాను చేసిన పాడు పనికి వారికి దూరంగా బ్రతకాల్సి వస్తోంది. నా అనేవారు లేక స్వాతి ఒంటరిగా నరకయాతన పడుతోంది. తప్పు చేశానని పచ్ఛాత్తాప పడ్డా ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా చేసిన తప్పుకు జైలు శిక్షతో పాటు ఆ దేవుడి శిక్షను కూడా ప్రస్తుతం స్వాతి అనుభవిస్తోంది. హ్యాపీగా ఉన్న జీవితాలను ఎందుకిలా నాశనం చేసుకుంటున్నారు. అసలు వీళ్లకు ఏమైంది. వీళ్ల మనస్తత్వాలు ఎందుకిలా మారిపోతున్నాయి.