NTV Specials : నల్ల కళ్ళజోడు.. మెడలో నోట్ల దండ.. ఏపీలో వింత ఆచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పెళ్లంటే పెళ్లి కొడుకు తాళి కట్టాలి కానీ అక్కడ మాత్రం పెళ్లి కూతురు కూడా తాళి కట్టాల్సిందే. అది అక్కడి ఆచారం. అంతేకాదు పెళ్ళికొడుకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని మెడలో నోట్ల దండ వేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అది కూడా ఆ ఊరి ఆచారం. అంతేకాదండోయ్ ఒకే రోజు ఒకే ముహూర్తానికి వందల పెళ్లిళ్లు జరుగుతాయి. ఇది ఎక్కడ వింత ఆచారం తంతు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే..
సహజంగా పెళ్ళిళ్ళు అంటే పెళ్లి కొడుకు తాళి కట్టడం పెళ్లికూతురు సిగ్గుతో తల దించుకొని కూర్చోవడమే మనం చూస్తూ ఉంటాం. కాని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలోని వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు మాత్రం అలా కాదంట. పెళ్ళిల్లో పెళ్ళికూతురు కూడా పెళ్లి కొడుకుకి తాళి కట్టాల్సి ఉంటుంది. అప్పుడే వారిద్దరికీ పెళ్లి జరిగినట్టు.. నువ్వులరేవులో ఇది ప్రతి ఏటా జరిగే తంతే. ఇక్కడ జరిగే పెళ్లిళ్లు అంటేనే చుట్టుపక్కల గ్రామాల వారికి భలే సరదా. పెళ్లిళ్లకు పెద్దగా ఆర్భాటం ఉండవు. ఇకపోతే అక్కడ జరిగే పెళ్లిళ్లలో విశేషాలు అన్ని ఇన్ని కావు. ప్రధానంగా నువ్వులరేవులో జరిగే పెళ్లిళ్లలో చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే గ్రామంలో అమ్మాయిలను గ్రామానికి చెందిన అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే బయట ఊరు కుర్రాలకు ఇవ్వరు అన్నమాట.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
నువ్వులరేవు గ్రామానికి చెందిన యువతీ యువకులు ఎక్కడ స్థిరపడిన పెళ్లి మాత్రం ఇక్కడి వారిని చేసుకోవాలి అనేది ఆనవాయితీ. పెళ్లి కొడుకు తాళి కట్టిన తర్వాత పెళ్లి కూతురు కూడా పెళ్ళి కొడుకుకి తాళి కట్టాలి. అలా అయితేనే పెళ్లి జరిగినట్టు ఇది గ్రామంలో వాళ్ళు అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఇక మరీ ముఖ్యంగా పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండ వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకుంటేనే పీటలు ఏక్కనిస్తారు. ఇది ఒక ఆచారమట. ఒకే రోజు ఒకే ముహూర్తానికి గ్రామంలో వందల పెళ్లిళ్లు జరుగుతాయి. ఊరి పెద్దలు మంచి ముహూర్తం నిర్ణయించి తేదీని ఖరారు చేస్తారు. ఇక గ్రామ ప్రజలు సైతం ఊరి పెద్దల మాటకు కట్టుబడి అదే సమయానికి పెళ్ళిళ్ళు జరుపుకుంటారు. ఇది చాలా కాలం నుంచి గ్రామస్తులు పెట్టుకున్న ఆనవాయితీ. పెళ్ళికి ముందు రోజు గంగమ్మ అమ్మవారిని పెళ్లి చేసుకునే వారి ఇంటికి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించడం కూడా ఇక్కడి ఆచారం.
ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వులరేవు పెళ్లిళ్లలో వింతలు చాలానే ఉన్నాయి. నిజానికి వీరంతా నాలుగు వందల ఏళ్ళ క్రితం ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారట. కాగా దశాబ్దాలుగా నువ్వులరేవులో పెళ్లిళ్లు ఇలాగే జరుపుకున్నారు. ఇక ఇక్కడ జరిగే వింత పెళ్లి వేడుకలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారట. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్ళుగా ఇక్కడ పెళ్లిళ్లు ఆశించిన స్థాయిలో జరగనప్పటికీ ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో ఈ ఏడు మాత్రం నువ్వులరేవులో పెళ్ళిళ్ళు యధావిధిగా జరిగాయి. మొత్తానికి వింత పెళ్ళిళ్లకు నెలవుగా చెప్పుకునే నువ్వులరేవులు, పెళ్ళిళ్ళు సజావుగా సాగడంపై అక్కడి ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!