సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఆవు.. ఏపీలో ఇదే తొలిసారి, టీటీడీ ఈవో ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు. గిర్ ఆవు పిండం.. ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని, తద్వారా వెన్న, నెయ్యిని అధికంగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 3.8 కోట్లు టీటీడీ ద్వారా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి ఇచ్చినట్లు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో మరిన్ని ఆవులను సరోగసీ విధానం ద్వారా పుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు.
భారత్, ఈజిప్ట్ మధ్య ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.. ఎంఓయూపై సంతకాలు
ప్రధాని ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాజధాని కైరోలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశాధ్యక్షుడు అడెల్ ఫతాహ్ అల్ సిసి ఈజిప్టు అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. మరోవైపు కైరోలోని హెలియోపోలిస్ యుద్ధ శ్మశానవాటికను కూడా ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు ఆయన నివాళులర్పించారు. ప్రధాని మోడీ కూడా ఆదివారం ఇక్కడ అల్ హకీమ్ మసీదును సందర్శించారు. అల్ హకీమ్ మసీదు 11వ శతాబ్దానికి చెందినది. ఇది ఈజిప్టులో సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మసీదు భారతదేశం, ఈజిప్ట్ పంచుకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. బోహ్రా కమ్యూనిటీ అవిశ్రాంత కృషి వల్ల ఈ మసీదు పునరుద్ధరణ సాధ్యమైంది.
ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. విషాదంలో ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది. తారక్ వీరాభిమాని చిన్న వయస్సులోనే మృతి చెందాడు. అయితే అతను ఎలా మృతి చెందాడు అనే డీటైల్స్ తెలియవు కానీ, అతని మృతిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అతని పేరు శ్యామ్ అని తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి మీద ఎన్టీఆర్ ను హత్తుకున్న కుర్రాడు శ్యామ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే శ్యామ్ కు ప్రాణం అంట. ఎక్కడ ఎన్టీఆర్ ఈవెంట్ జరిగినా ముందు ఉండి అన్ని పనులు చేయడంతో పాటు అన్ని విషయాల్లో తారక్ పేరును నిలబెట్టేలా మంచి పనులు కూడా చేసేవాడట.
ఈ నెల 28న కురుపాం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు. కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు.
బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తున్న భారత్.. చైనాకు చుక్కలే
చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని గతంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్ వరకు కొనసాగుతుంది. చైనా కుయుక్తులను ఎదుర్కోవడానికి, భారతదేశం LAC ప్రాంతం అభివృద్ధిలో భారత్ నిమగ్నమై ఉంది. LACకి దళాలను వేగంగా తరలించడానికి బ్రహ్మపుత్ర కింద ఈ వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్గం సుగమం చేసింది. గోహ్‌పూర్, నుమాలిఘర్ మధ్య ప్రతిపాదిత 35 కి.మీ పొడవైన కారిడార్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ని సిద్ధం చేయడానికి జూలై 4 న సాంకేతిక బిడ్‌లను తెరవనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అవినీతి చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిందని పవన్ అన్నారు. రాజోలు విజయం గాయపడ్డ గుండెకు సేదతీరినట్లయిందని, రాజోలులో వెలిగించిన చిరుదీపం.. రౌడీలు, దౌర్జన్యాల పాలిట అఖండజ్యోతి అవుతుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. మలికిపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌పై పవన్ ఫైర్ అయ్యారు. బోటు అనే మా ఓట్లపై గెలిచి తెప్పదాటిన తరువాత మాపై దూషిస్తే ఊరుకోమన్నారు. 151 వైసీపీ ఎమ్మెల్యేలకు రాజోలు ఒక సమాధానమైందన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఓయాసిస్‌లా పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కావాలని పోటీ పడండి. మనలో మనం కొట్టుకుంటూ పార్టీని నట్టేట ముంచవద్దని నేతలకు సూచించారు. మన గెలుపు ప్రజల గెలుపు కావాలన్నారు.
గోవా బ్యూటీ ఇలియానా కు బీచ్ అంటే అంత ఇష్టమా..?
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిని బాగా ఆకట్టుకుంది.. ఇక గతంలో ఇలియానా డేట్స్ కోసం తెగ ఎదురు చూసేవారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఆమె కు అస్సలు అవకాశాలు రావడం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలు ఇలియానా తోనే సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఇలియానా తన నడుము అందాల తో అందరిని మాయ చేసింది.ఇలియానా నడుముకు ఉండే ఆ క్రేజ్ వేరు. ఇలియానా తన నడుము అందాలతో అందరిని ఇట్టే పడేస్తుంది.ఇలియానా మంచి నటిగా కూడా మెప్పించింది.సౌత్ నుంచి నార్త్ వరకు తన నటన తో ఎన్నో సినిమా అవకాశాలు అందుకుంది.. ఇక ఇలియానా ఈ మధ్య కాలంలో పెళ్లికాకుండానే తల్లి అయిన విషయం తెలిసిందే.తాను ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది ఇలియానా. ఇలియానా కి పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ సోషల్ మీడియా లో తెగ వార్తలు వస్తున్నాయి.
ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేసిన ఘనత కాంగ్రెస్ నేతలది
సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణి మాఫియాకు సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు. సోమేశ్ కుమార్ ను ఏపీకి పంపిస్తే చేతగాక తెలంగాణకి వచ్చిన సోమేశ్ కుమార్ కేసిఆర్ స్పెషల్ అడ్వైజర్ గా పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేసిన ఘనత కాంగ్రెస్ నేతలదని ఆయన అన్నారు.
ఘోర ప్రమాదం..కారుని ఢీకొన్న లారీ.. నలుగురు మృతి..
తెలంగాణలో మరో ఘోర ప్రమాదం జరిగింది.. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు-కటాక్షాపూర్ మార్గం మధ్యలో కారును టిప్పర్ ఢీకొట్టడం తో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లో మృతి చెందారు… దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.. చనిపోయిన వారంతా సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులు గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు..
ఎదురుగా వేగంగా వస్తున్నా టిప్పర్ ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.. యాక్సిడెంట్ లో డ్రైవర్‌తో పాటు మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.