సంబరాలు ఎందుకు.. ఎమ్మెల్యే కందాలను ప్రశ్నించిన రైతు
అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు ప్రశ్నించారు. దీంతో రైతు దినోత్సవం కాస్త రసాభసగా మారింది. రైతుల ప్రశ్నలకు కందాల సమాధానం చెప్పలేక పోయారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతు దినోత్సవంలో రైతు ప్రశ్నిస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి వద్ద రైతు దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా రైతులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మైక్ లో మాట్లాడుతున్న క్రమంలో ఒకరైతు లేచి ఏం చేస్తున్నారని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతం అంతా సైలెంట్ గా అయ్యింది. ఎమ్మెల్యేను రైతు నిలదీయడంతో ఎమ్మెల్యే రైతుకు సమాధానం చెబుతున్నా అయినా రైతు ప్రశ్నలు అడుగుతూ తన సమస్యలు చెబుతునే నిలదీశాడు.
ఏపీలో మరో రైలుకు తప్పిన ప్రమాదం.. లోకో పైలట్ అప్రమత్తతో సేఫ్
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా అందరనీ కలచివేస్తుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. మరో 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంకొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. రాత్రివేళ ప్రమాదం జరగడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. చర్యలు తీసుకుంటున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
ఒడిశా రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 237 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చిన ఈ ప్రమాదం లో తెలుగువారు దాదాపు 170 మంది మృతిచెందినట్లు సమాచారం. గతరాత్రి నుంచి ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ తల్లడిల్లుతోంది. దేశంలోనే ఘోరమైన యాక్సిడెంట్ గా ఈ ఘటనను పరిగణిస్తూ సినీ సెలబ్రిటిస్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు దైర్యం ప్రసాదించమని దేవుడ్ని వేడుకుంటున్నారు.
పసికందు ప్రాణం తీసిన మద్యం మత్తు..దారుణం..
మద్యం ఓ కుటుంబంలో విషాధాన్ని మిగిల్చింది.. తండ్రి మద్యం మత్తు అభం శుభం తెలియని ఆరు నెలల పసికందు ప్రాణాన్ని పోగొట్టింది.. మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటయ పాలెంలో వేమూలూరి గాంధీ, భార్య వ్యవసాయ కులీ పని చేసుకునేవారు. మద్యం తాగే అలవాటు ఉన్న గాంధీ రోజూ అలవాటులానే పని ముగించుకొని తాగి ఇంటికి వచ్చి సేదతీరేందుకు మంచంపై పడుకున్నాడు…
అయితే అదే మంచంపై నిద్ర పోతున్న తన కూతురు దివ్య(6 నెలలు)ను గమనించకుండా చిన్నారిపై పడుకోవడంతో.. పాప అపస్మారక స్థితికి చేరకుంది.తల్లి బిడ్డ నిద్రపోతుందనుకుంది.. ఆ తర్వాత పని ముగించుకొని బిడ్డ దగ్గరకు వచ్చింది.. బిడ్డలో కదలికలు లేకపోవడంతో వెంటనే బంధువులను తీసుకొని ఆసుపత్రికి వెళ్లింది.. కానీ మార్గమధ్యంలోనే ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. భర్త తాగుడు వల్లే తన బిడ్డ ప్రాణాలు పోయాయని గుండెలు బాదుకుంటూ కన్నీరు పెట్టుకుంది.. ఆమెను చూసిన గ్రామస్తులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.. తెలిసి చేసిన తెలియక చేసిన పసిబిడ్డ ప్రాణాలు పోయాయి.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయాలు అలుముకున్నాయి..
ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!
నిన్న ( శుక్రవారం ) సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొనడానికి ముందు క్షణాల్లో రైలు ట్రాఫిక్‌ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిందం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 288 మందికి పైగా మరణించాగా.. సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదికను వెల్లడించింది. దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సమయంలో రైలునంబర్ 12864 దిగువ మెయిన్ లైన్ లో రెండు కోచ్‌లు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి.
బెంగళూరు-హౌరా రైలు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొట్టింది. అయితే, కొంతమంది రైల్వే నిపుణులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా “లూప్ లైన్” లోపల గూడ్స్ రైలును ఢీకొట్టి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. విజువల్స్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ గూడ్స్ రైలు పైభాగంలో ఉన్నట్లు చూపిస్తుంది. ఇది నేరుగా ఢీకొనడాన్ని సూచిస్తుంది. ఒక “లూప్ లైన్” ప్రధాన రైల్వే ట్రాక్‌ల నుంచి విడిపోతుంది.. కొంత దూరం తర్వాత మెయిన్‌లైన్‌కి తిరిగి వస్తుంది. ఇవి రద్దీగా ఉండే రైలు ట్రాఫిక్‌ని నిర్వహించడానికి సహాయపడతాయి. సిగ్నల్ సిస్టమ్ తప్పిదం, మానవ తప్పిదం, విధ్వంసం వంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు… ఒక్కటీ నెరవేర్చలేదు
20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని, రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, నెరవేర్చలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నాడని, కేసీఆర్ ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేశారని ఆయన విమర్శించారు. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందని, తెలంగాణలో వున్న వారికి పరిహారం ఇవ్వకుండా పంజాబ్, బీహార్ వారికి డబ్బులు కేసీఆర్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల బాల్ టాంపరింగ్ వ్యవహారం గుర్తుందా? ఈ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఇద్దరిపై కఠిన శిక్షలు విధించింది. రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే.. వార్నర్ విషయంలో మరో క్రికెట్ ఆస్ట్రేలియా మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. స్టీవ్ స్మిత్‌పై మాత్రం అలాంటి చర్యలు తీసుకోలేదు. అతడు మళ్లీ జట్టుకి వైస్ కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరులో జట్టుకి నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. ఇలా స్మిత్ పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సున్నితంగా ఉండటం, తన కెప్టెన్సీపై జీవితకాలం బ్యాన్ విధించడంతో నొచ్చుకున్న డేవిడ్ వార్నర్.. తన కెప్టెన్సీ బ్యాన్‌పై గతేడాది నవంబర్‌లో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీంతో.. ఆ పిటిషన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే.. ఈ కేసుని బహిరంగంగా విచారణ చేపట్టాలని ఆ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన వార్నర్.. చివరికి తన రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 170 మంది తెలుగు వారు ఉన్నారు- మంత్రి గుడివాడ అమర్నాథ్
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కినవారిలో 170 మంది తెలుగువారున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రమాద ఘటనలో మృతులు, గాయపడ్డ వారు, మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు 200 మందికిపైగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వేషన్ వివరాల ఆధారంగా వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు మొత్తం 122 మంది ఉన్నారు. ఇందులో కొందరు సేఫ్ గా ఉన్నట్లు తమ కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. చాలా మంది వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. వారికి ఫోన్లు చేస్తే కలవడంలేదని.. కొంతమందివి, స్విచ్ఛాప్ అని వస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తమ వారు ఎలా ఉన్నారో.. ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.
చితిపై నుంచి లేచిన వ్యక్తి.. భయంతో పరుగు తీసిన జనం..
ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మోరీనాలో దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు మేల్కొన్న వ్యక్తి, వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మే 30న జరిగినట్లు తెలుస్తోంది.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జీతూ ప్రజాపతి అనే వ్యక్తి మే 30 న హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన ఉలుకుపలుకు లేదు..
ఇక అతన్ని కుటుంబ సభ్యుల సహా స్నేహితులు, ఇరుగుపొరుగువారు జీతూ మరణించాడని భావించారు. దీంతో సాంప్రదాయ పద్దతితో జీతుకి అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. మోరీనాలోని 47వ వార్డులోని శాంతిధామ్‌కు మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. చితిని పేర్చి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో అతను నిద్ర లేచినట్లు మేల్కొన్నాడు. హఠాత్తుగా అకస్మాత్తుగా జీతూ శరీరం కదలడం ప్రారంభించడంతో అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు..ఆ తర్వాత డాక్టర్ ను తీసుకువచ్చారు.. అతను పరీక్షించి గుండె కొట్టుకుంటుందని అతనికి వైద్యాన్ని అందిస్తున్నారు..ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులే..
చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే.. కానీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో జగన్ పొగిడారు అని తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. లోకేష్‌ది చిల్లర వ్యవహారమన్న సజ్జల.. చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడన్నారు. కింది స్థాయి కార్యకర్తలు చేస్తే అర్థం చేసుకోవచ్చని.. గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం వచ్చి ఉంటుందని మండిపడ్డారు. బీజేపీతో కలవటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని… మరిప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.