Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో 10 మంది రోడ్డు రేసర్లు చనిపోయారు. దశాబ్దాలుగా అమెరికా ఈ సంక్షోభంతో సతమతమవుతోంది. ఇక్కడ కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి. చాలా సార్లు ఇది రాజకీయ సమస్యగా మారింది.
Read Also:Rs. 2000 Notes: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు
అమెరికాలో తుపాకీ సంస్కృతికి సంబంధించిన ఘటనలు తెరపైకి రావడం ఇదే మొదటి సారి కాదు. కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాల్లో, మరి కొన్నిసార్లు బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఇందులో చాలా మంది అమాయకులు చనిపోతున్నారు. మెక్సికోలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 10 మంది రేసర్లు చనిపోయారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా ఈ దాడి జరిగిందని కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్ తెలిపారు.
Read Also:Bichhagadu 2: ఈమధ్య తెలుగు సినిమాలకి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు
911 కాల్ నివేదికల ప్రకారం.. దుండగులు పెద్ద మొత్తంలో ఆయుధాలు కలిగి ఉన్నారని తేలింది. దుండగులు గ్రే కలర్ వ్యాన్‌లోంచి దిగి కాల్పులు జరిపారు. సమాచారం అందిన తర్వాత పోలీసులు, మెరైన్స్, అగ్నిమాపక దళం, మెక్సికన్ రెడ్‌క్రాస్ ఇలా అందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 9 మంది గాయపడ్డారు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే రోజూ ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట వస్తూనే ఉంటాయి.