తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. తెలంగాణలో ఎండలు.. ఏపీలో పలు జిల్లాలకి వర్ష సూచన!
బిపర్‌జాయ్ తుఫాను తీవ్ర ప్రభావం నైరుతీ రుతుపవనాలపై చూపించింది. వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడంతో.. రుతుపవనాల్లో చల్లదనం మాయమైంది. వాటి కదలిక కూడా నెమ్మదిగా సాగుతుంది. దీని వల్లే రుతుపవనాల వల్ల వర్షాలు కురవట్లేదు. మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు బిపర్‌జాయ్ తుఫాన్ ప్రభావం పోవడంతో.. ఇకపై రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, జిల్లాలో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయనీ… అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కోస్తా ఆంధ్రలో కూడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల వానాలు పడతాయి అని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటూ కొన్ని జిల్లాల్లో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలో చేరిన కీలక నేత..
మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంఎల్సీ మనీషా కయాండే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. శివసేన వ్యవస్థాపక దినోత్సవం రోజునే మనీషా కయాండే షిండే వర్గంలో చేరిపోయింది. రెండు రోజుల్లో వరసగా ఉద్దవ్ వర్గానికి రెండు షాక్ లు తగిలాయి. మనీషా కయాండే శివసేన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు రోజు కీలక నేత శిశిర్ షిండే ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గంలో చేరిపోయారు.
ఉద్ధవ్ వర్గాన్ని విడిచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై ఆయన వర్గం ఆత్మపరిశీలన చేసుకుంటుందో లేదో చూడటానికి తాను ఒక ఏడాది పాటు వేచి ఉన్నానని కయాండే అన్నారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బాలాసాహెబ్ ఠాక్రేకు చెందిన అసలు సేన అని ఆమె అన్నారు. షిండే ప్రభుత్వం గత జూన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమర్ధవంతంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కయాండే ప్రశంసించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎజెండాలను ప్రచారం చేసినందుకు ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ జిల్లాలకు అలెర్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇటీవల బిపర్ జాయ్ తీవ్ర తుఫాన్ వల్ల స్తంభించిన రుతుపవనాలు మళ్లీ విస్తరించడం మొదలుపెట్టాయి.. ఇక త్వరలోనే తెలంగాణా లో కూడా ప్రవేశినుంచనున్నాయి.. ఈ మేరకు నేడు, రేపు తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, కామా రెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక రేపు కూడా కొన్ని జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది..
మరో వారం రోజుల పాటు ఒంటిపూట బడులే..
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మూడో వారం వచ్చినా ఎండలు మాత్రం తగ్గడం లేదు.. రికార్డు స్టాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 12 నుంచి వేసవి సెలవుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కొనసాగుతున్న వేసవి కారణంగా సెలవులు పొడిగించాలని అభ్యర్దనలు రావడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యా శాఖ గతంలో నిర్ణయించింది.. అయితే, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎండలు మండిపోతుండటంతో.. ముందుగా ప్రకటించిన ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 17వ తేదీ వరకు అదే విధంగా పాఠశాలలు కొనసాగాయి.. ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.
10 రూపాయల ఫ్రూటీ.. రూ. 8 కోట్ల దోపిడీ నిందితుల్ని పట్టించింది.. ఎలాగో తెలుసా..?
పంజాబ్ లో రూ. 8 కోట్ల దోపిడీ ఇటీవల కలకలం సృష్టించింది. డాకు హసీనాగా పేరొందిన మన్ దీప్ కౌర్, ఆమె భర్ జస్విందర్ సింగ్ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. అయితే వీరు దోపిడి అనంతరం పారిపోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పంజాబ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే కేవలం రూ.10 ఫ్రూటీ డ్రింక్, రూ. 8 కోట్ల దోపిడీ నిందితులను పట్టించేలా చేసింది. పంజాబ్ పోలీసులు పన్నిన ఉక్కులో నిందితులు పట్టుబడ్డారు.
జూన్ 10న లూథియానాలో రూ. 8.49 కోట్లు దోపిడికి గురయ్యాయి. ఈ కేసులో డాకు హసీనాగా పిలువబడే మన్ దీప్ కౌర్ కీలకంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని చమోలీలోని హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళుతుండగా మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పంజాబ్‌లోని గిద్దర్‌బాహాకు చెందిన మరో నిందితుడు గౌరవ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆర్జిత సేవ, దర్శన టికెట్లు విడుదల
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని వారికి 24 గంటల టైం పడుతోంది. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనుననారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను ఈ రోజు విడుదల చేయనుంది.
గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదు..
మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని మెక్సికో అధికారులు తెలిపారు. భూకంపం వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేపుల్లో అలలు ఎగిపడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా వచ్చిన భూకంపం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.
తన బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రాంచరణ్…?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ ఎటువంటి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనకుండా ఇంటి వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. అయితే రాంచరణ్ గత నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ను ఇచ్చారు. అయితే ఈ బ్రేక్ మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు సమాచారం. ఈయన ఆగస్టు నెల వరకు తన షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.రాంచరణ్ షూటింగుకు విరామం ఇవ్వడానికి కారణం కూడా ఉంది.పెళ్లై దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని తన భార్యకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఆగస్టు వరకు ఎలాంటి షూటింగ్స్ ఉండబోవు అంటూ ఈయన షూటింగ్ కు విరామం ప్రకటించారని సమాచారం..ప్రస్తుతం ఉపాసన ఎనిమిదవ నెల గర్భిణీగా ఉంది.ఈమె జులై మొదటి వారంలోనే తన బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.అందుకే ఎటువంటి వర్క్ టెన్షన్ లేకుండా రాంచరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది..
ప్రాణం తీసిన పదివేలు.. అక్కాచెల్లెల్లు మృతి..
అప్పులు ప్రాణాలు తీస్తాయని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు.. అది నిజమే అని చాలా సార్లు రుజువైంది..అప్పుల వల్ల కుటుంబాలు విచ్చిన్నం అవ్వడమే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది..అప్పు విషయంలో చెలరేగిన ఓ గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను తీసుకుంది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మీద చేసిన దాడిలో అతని ఇద్దరు సోదరీమణులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.. ఈ విషాద ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలో ని ఆర్కేపురం అంబేద్కర్ బస్తీలో లలిత్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఒక వ్యక్తికి అతను గతంలో రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకుని చాలా రోజులైనా చెల్లించక పోవడంతో.. తన దగ్గర తీసుకున్న మొత్తాన్ని తనకు తిరిగి చేయాలంటూ శనివారం లలిత్ అతడిని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ వ్యక్తి లలిత్ ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ పడుకున్న సమయంలో.. తనతోపాటు ఓ 20 మందిని తీసుకొని లలిత్ ఇంటికి వచ్చాడు..
రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్
ఓవర్సీస్‌లో ఆదిపురుష్ దుమ్ముదులిపేస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా.. హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ని సైతం వెనక్కి నెట్టేసింది ఆదిపురుష్. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా టిల్ డేట్ 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని దాటిన ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే లోపే ఆదిపురుష్ సుమారు 3.5-4 మిలియన్ డాలర్లు రాబట్టనుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అమలాపురం నుంచి అమెరికా వరకు ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేస్తోందనే చెప్పాలి.
ప్రభాస్ ఓవర్సీస్ ర్యాంపేజ్ కి సూపర్ స్టార్స్ రజిని, మహేష్ బాబుల రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సౌత్ ఇండియా నుంచి అత్యధికంగా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలు రజినీకాంత్, మహేష్ బాబు లిస్టులోనే ఉన్నాయి. ఇప్పటివరకూ రజినీకాంత్ నాలుగు సార్లు, మహేష్ బాబు నాలుగు సార్లు ఓవర్సీస్ మార్కెట్ లో 2 మిలియన్ డాలర్స్ ని రాబట్టారు. ప్రభాస్ ఇప్పుడు ఈ ఇద్దరి రికార్డులని బ్రేక్ చేసి 5 టు మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలతో టాప్ ప్లేస్ చేరాడు. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాల తర్వాత ఆదిపురుష్ సినిమా ఈ ఎలైట్ లిస్టులో చేరింది. ఇప్పటికే ఇండియాలో నాన్-ప్రభాస్ రికార్డ్స్ అనే మాట వినిపిస్తోంది. సలార్, ప్రాజెక్ట్ K కూడా రిలీజ్ అయిపోతే ఓవర్సీస్ లో కూడా నాన్-ప్రభాస్ రికార్డ్స్ అనే మాట వినిపించడం గ్యారెంటీ.
ఏపీలో ఇవాళ్టి నుంచే డిగ్రీ కాలేజీల్లో ఆడ్మిషన్లు షూరు
ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ్టి నుంచి జూన్ 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, అటనామస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులు నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.