బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అదిగో ఆ సినిమాతో, ఇదిగో ఈ చిత్రంతో అంటూ.. త్వరలో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందని చాలా పుకార్లొచ్చాయి. కానీ, అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈమె టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టు జోరుగా ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం…
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తోన్న తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్…
ముందుగా ఊహించినట్టుగానే జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. అవి.. NTR30 & NTR31. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే! మొదటి చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, జూన్ నెల నుంచి అది సెట్స్ మీదకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇక రెండోది ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో కార్యరూపం దాల్చనుంది. ఫస్ట్ లుక్ మినహాయిస్తే, మరే ఇతర వివరాల్ని వెల్లడించలేదు. ఈ రెండు అప్డేట్స్ అయితే ఫ్యాన్స్‌ని, సినీ…
కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కమిటైనప్పుడే.. ఇందులో కథానాయికగా నటించేందుకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విషయాన్ని పలుసార్లు ఆలియా కన్ఫమ్ చేసింది కూడా! అయితే.. అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడం, రణ్బీర్‌తో పెళ్ళి కూడా అయిపోవడంతో.. ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటినుంచి NTR30లో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఆలియా తప్పుకున్నాక మేకర్స్ చాలామంది…