NTR30: తారక్ సరసన ఆ కన్నడ బ్యూటీ.. ఆ బాలీవుడ్ భామ కూడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna To Play Lead Actress In NTR30: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని NTR30 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంపై ఎలా అయితే క్లారిటీ లేదో, అంతే ఈ చిత్రాన్ని హీరోయిన్ సమస్య పట్టి పీడిస్తోంది. ఎవ్వరూ ఓ పట్టాన ఫైనల్ అవ్వడం లేదు. మొదట్లో ఆలియా భట్‌ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, సినిమా జాప్యం కావడంతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఆ తర్వాత ఆమెని సంప్రదించలేదన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇంకా సమంత, కృతీ శెట్టి సహా మరికొందరు భామల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. అవి రూమర్లుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమె మరెవ్వరో కాదు.. రష్మికా మందణ్ణ. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్‌గానూ అవతరించడంతో.. భారీ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాన కూడా ఈ బ్యూటీ హవానే కొనసాగుతోంది కాబట్టి.. దర్శకనిర్మాతలు ఈమె వెంటే పడుతున్నారు. తాజాగా NTR30 చిత్రబృందం కూడా ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆమెతో చర్చలు జరపడం, రష్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి అమ్మడు భారీ పారితోషికం కూడా అందుకుంటోందని ఇన్‌సైడ్ న్యూస్! అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదే సమయంలో.. లైగర్‌లో నటించిన అనన్యా పాండేని సైతం సంప్రదించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
కాగా.. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివ రెండోసారి ఈ NTR30 ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. దీంతో.. ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే నెలకొన్నాయి. నిజానికి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సింది కానీ, ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా పుణ్యమా అని, తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు మేకర్స్ మళ్లీ కసరత్తులు మొదలుపెట్టారు. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. అయితే, ఇప్పుడా పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారని చెప్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!