ముందుగా ఊహించినట్టుగానే జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. అవి.. NTR30 & NTR31. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే! మొదటి చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, జూన్ నెల నుంచి అది సెట్స్ మీదకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇక రెండోది ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో కార్యరూపం దాల్చనుంది. ఫస్ట్ లుక్ మినహాయిస్తే, మరే ఇతర వివరాల్ని వెల్లడించలేదు. ఈ రెండు అప్డేట్స్ అయితే ఫ్యాన్స్‌ని, సినీ ప్రియుల్ని సంతోషపరిచాయి.
అయితే, ఇదే సమయంలో మరో అప్డేట్ కూడా రావొచ్చని అంతా ఆశించారు. అదే.. బుచ్చి బాబు సానా & తారక్ ప్రాజెక్ట్ (NTR32). కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్రేజీ గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందని, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపించింది. ఇలా ఒకదాని తర్వాత మరొక న్యూస్ జోరుగా చక్కర్లు కొట్టడంతో.. ఈ ప్రాజెక్ట్‌ను తారక్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయొచ్చని భావించారు. కానీ, అలా జరగలేదు.
అనౌన్స్‌మెంట్ సంగతి దేవుడెరుగు, అసలు ఈ ప్రాజెక్ట్‌ని ఎవ్వరూ ప్రస్తావించనే లేదు. కేవలం తారక్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ.. ఆయనతో కలిసి దిగిన ఫోటోను బుచ్చి బాబు షేర్ చేశాడో తప్ప, ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పలేదు. దీంతో, ఈ ప్రాజెక్ట్ సంగతేమైంది? అసలు ఇది ఉంటుందా, ఉండదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే, కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే!