మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఆమిర్‌ఖాన్, కరణ్ జోహార్, జావేద్ అక్తర్, జానీ లీవర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకపై చరణ్.. తారక్ గురించి వస్తున్న రూమర్స్ ని కొట్టిపడేశారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించారు. అయితే తారక్ కు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని, చరణ్ ను హైలైట్ చేసినట్లు తారక్ ను హైలైట్ చేయలేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలపై ఇటీవల ఎన్టీఆర్ స్పందించి అలాంటిదేమి లేదని, జక్కన్న ఇద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేసాడని చెప్పుకొచ్చాడు . అంతేకాకుండా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదని, ఇద్దరం ఎంతో కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా రామ్ చరణ్ సైతం ఈ వార్తలపై స్పందించాడు. ” సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రకు ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయన్న మాటను నేను ఏకీభవించను.. ఇద్దరం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. రాజమౌళి కూడా మ్నా ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. మా అపాత్రలకు మేమెంత న్యాయం చేశామో.. ఆ పాత్రలను సమానంగా చూపించడానికి జక్కన్న మాకన్నా ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారు. నేను ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తారక్ నటన అద్భుతం.. తారక్ తో కలిసి ప్రయాణించిన రోజులను ఎప్పటికి మర్చిపోలేను. మా ఇద్దరికి ఈ అవకాశం కల్పించి, మా స్నేహాన్ని మరింత బలపరిచిన రాజమౌళికి థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏ ఏవైకాయ్లు నెట్టింట వైరల్ గా మారింది