ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఎన్టీఆర్ కొద్దిగా ఫ్రీగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ప్రశాంత్.. ఇక దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ 31 లో ఎన్టీఆర్ సరసన అలియా నటిస్తుందని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనున్నదట. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూ లో దీపికా మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని, ఆయన నటన అంటే తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక కొరటాల ఆఫర్ రాగానే వెంటనే దీపికా ఓకే చేసినట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా ఉండదనే చెప్పాలి.