ఒకటో తేదీ పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోంది.. ఒక్కరోజులోనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందిపెట్టింది.. కానీ, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు..
గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు..
CM Chandrababu : సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఈరోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన…
AP Pension Distribution: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగ జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు.
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.