Pawan Kalyan: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు
- కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్..
- ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి పిఠాపురానికి పవన్..
- కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వస్తూ వస్తూనే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పనిలో దిగిపోయారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెంచన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద వృద్దులకు 7000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు పంపిణీ చేశారు.. అయితే, దివ్యాంగులకు నాలుగు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. దివ్యాంగుల పెన్షన్. 3000 నుండి 6000 రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు..
Read Also: Thailand: రూ.50 వేలతో థాయ్‌లాండ్‌ను సందర్శించొచ్చు.. వసతి, ఆహారం అన్ని ఈ బడ్జెట్‌లోనే!
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి వచ్చారు.. గెలిచిన వెంటనే. పనిలోకి దిగాను అని తెలిపారు.. విజయోత్సవ సభలతో సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేదు.. కీలకమైన శాఖలు తీసుకున్నాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తున్నాను అన్నారు.. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ రావని ప్రచారం చేస్తే గుర్తింపు చేసి అందజేస్తున్నాం.. వైసీపీ లాగా కాకుండా.. సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం అన్నారు.. వైసీపీ పాలనలో ప్యాలెస్ నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్న.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలేశాను అన్నారు.. ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతా.. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే. పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు. పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు.. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!