Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. నా జీతం కూడా వదిలేస్తున్నా..
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
- జీతం తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నానన్న పవన్..
- పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను..
- ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కలయాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జీతం కచ్చితంగా తీసుకుంటా.. అప్పుడే జవాబుదారి తనం ఉంటుంది.. అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్.. ఇప్పుడు.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన.. గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలివేశా అని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి గెలిచిన వెంటనే పనిలోకి దిగాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాను అన్నారు..
Read Also: Pawan Kalyan: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు
Also Read
ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం అని ప్రకటించారు పవన్ కల్యాణ్.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను అన్నారు.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతాను అని వెల్లడించారు. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు.. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను అన్నారు డిప్యూటీ సీఎం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు అని ఆరోపించారు. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయడం సాధ్యం కాదన్నారు.. ఇది నిజం కాదని.. ఈవేళ ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసి రుజువు చేశాం అన్నారు పవన్.
Read Also: Darshan : కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ ఏంటో తెలుసా ?
ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్విర్యం అయ్యాయి.. ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ గాడిలో పెడతాం అన్నారు పవన్.. నా ఐదేళ్ల పాలనలో రక్షిత మంచినీటి పథకం లేని గ్రామం ఉండకుండా చేయాలన్నదే లక్ష్యం.. గిరిజన మారుమూల ప్రాంతాల్లో అనారోగ్యం బారినపడిన వారిని డోలుపై మోసుకుని రాకుండా సౌకర్యాలు కల్పించాలని ఉందన్నారు. ఇక, పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకుంటా.. ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నాను అని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!