యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…