యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ దాదాపు రూ 383.35 కోట్లు – రూ.460.02 కోట్లు ఉన్నట్లుగా అంచనా.
Read Also : “డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ నటులలో ఒకరు. యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే తారలలో ఒకరు. ప్రస్తుతం ఆయన దేశం మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్‌ఆర్‌ఆర్”లో నటిస్తున్నారు. రాజమౌళి ప్రధాన తారాగణంతో ఆగస్టు 1న ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ను విదేశాల్లో చిత్రీకరిస్తారు.