తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో ఇద్దరు హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చికోటి వ్యవహారం బయట…
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్‌లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న…
కరోనా మందుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. ఇప్పుడు కలకలం సృష్టిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా మందు తయారు చేసినట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొంతమంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి రావడం.. స్థానికులు మందు పంపిణీని అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు ఆనందయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.. ఆనందయ్యకు తాజాగా నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్… కరోనా మందు పంపిణీకి…
కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల లోపు పార్లమెంటుకు వచ్చి ఐటీ చట్టం అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్విట్టర్ ఇదివరకే సానుకూలంగా స్పందించినప్పటికీ…
భారత ప్రభుత్వం.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య ఇప్పటికే వారు నడుస్తోంది.. తాజాగా, ఆ సంస్థ వ్యవహార శైలి మరోసారి భారత్‌కు కోపం తెప్పించింది.. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది.. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని.. లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోకతప్పదని హెచ్చరించింది ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్…ట్విట్టర్ వ్యవహారంపై సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత నోటీసులు…
ట్విట్టర్ కు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. నూతన ఐటీ రూల్స్ ట్విట్టర్ పాటించాల్సిందేనని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిబంధనలు ట్విట్టర్ పాటించడం లేదన్న పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ అంశంపై తమ వైఖరి తెలపాలని కేంద్రంతో పాటు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. నూతన ఐటీ నిబంధనలు పాటిస్తున్నామని… గ్రీవెన్స్ అధికారిని సైతం నియమించినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే ట్విట్టర్ వాదనను కేంద్రం తప్పుబట్టింది. ఇరు పక్షాల…
వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ…