గృహిణిలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరలు పెరుగుతాయంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నూనెల ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలతో భయాందోళన చెందారు.