ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజంలో గ్లోబల్ ట్రెండ్స్ అనే అంశంపై జరిగిన మూడో 'నో మనీ ఫర్ టెర్రర్' మంత్రివర్గ సదస్సు తొలి సెషన్‌కు అధ్యక్షత వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.