నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియా ఆటలు మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. రాత్రయితే చాలు ఇసుక అక్రమంగా రవాణా సాగుతోంది. ఈ ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఏ ను హత్య చేసింది ఇసుక మాఫియా. బోధన్ మండలం కండ్గావ్‌లో ఈ దారుణం జరిగింది.
గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు వీఆర్‌ఏ గౌతమ్. ఇసుక మాఫియా దీనిని సహించలేదు. వీఆర్‌ఏను చితకబాదింది ఇసుక మాఫియా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీఆర్‌ఏ గౌతమ్ మృతిచెందడం కలకలం రేపింది. వీఆర్‌ఏ హత్యతో ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గౌతమ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.