బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా.. ఇందులో, ఎన్‌డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో రెండోసారి అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా పట్టణాన్ని సందర్శించి రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఆర్జేడీ అధినేత నితీష్‌కుమార్ వెళ్లారు. అంతేకాదు.. బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.
బీహార్ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతుగా నిలిచారు.
బీహార్‌లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు.
బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నితీష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.