ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.
ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్లకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. స్నాతకోత్సవంలో నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. భారత బయోటెక్ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, ఆస్ట్రా మైక్రోవేవ్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు..…
వాయు కాలుష్యం అన్నింటికంటే ప్రధాన సమస్య అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ… ఐదు లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదార్లను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.. 2024 నాటికి ఏపీలో ఐదు లక్షల కోట్ల హైవే ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయని వెల్లడించారు.. ఇక, ఏపీకి రానున్న మూడు నెలల్లో మరో 3 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. షిప్పింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ముఖ్యమైన రాష్ట్రంగా పేర్కొన్నారు గడ్కరీ.. ఏపీ…
వరుసగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ.. ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజుల పాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ నాయకులు అందరూ హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు అందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీలో నిలిచిన…
ఫిట్‌నెస్ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ స్టార్ట్స్, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు…
భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు,…
మండిపోతున్న పెట్రో ధరలతో క్రమంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.. అయితే, దేశవ్యాప్తంగా ఈ మధ్యే.. పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.. ఇంట్లో చార్జింగ్ పెట్టిన సమయంలోనే కొన్ని.. రోడ్లపై మరికొన్ని ప్రమాదాలు గురయ్యాయి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆయా వాహనాల కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు గడ్కరీ.. లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆదేశించారు.. అంతేకాకుండా ఇప్పటిదాకా…