వరుసగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ.. ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజుల పాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ నాయకులు అందరూ హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు అందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో ఇదే రోజుల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ మద్దతు పలికిన ద్రౌపది ముర్ముపై యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తోంది. కాగా.. కేసీఆర్ ఇందుకు తగిన ఏర్పాట్లు చేయించారు. ఈ మొత్తం బాధ్యతను కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
విఐపీ షెడ్యూల్
ఉదయం 11 గంటలకు – యశ్వవంత్ సిన్హా
ఉదయం 11 గంటల 35 నిమిషాలకు రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ
మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
మధ్యాహ్నం 2 గంటల 55 నిమిసాలకు ప్రధాని మోడీ
read also: Manipur Landslide: 20కి చేరిన మృతుల సంఖ్య..44 మంది మిస్సింగ్
భాగ్యనగరానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం బేగం పేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమై రాత్రి బెంగుళూరుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.
11.35 కి రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ బేగంపేట్ చేరుకోనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మోదీతో పాటు వీరు హాజరు కాకున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి 1 గంట 30 నిమిషాలకు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని యోగి ఆదిత్యనాథ్ సందర్శించనున్నారు. అనంతరం 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్ (HICC)కు చేరుకోనున్నారు.
read also: TDP: అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ ప్రకటన హల్‌చల్.. టీడీపీ క్లారిటీ
ప్రధాని మోడీ నేడు మధ్యాహ్నం 2 గంటల 55 నిమిసాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ సమావేశం చర్చించిన తరువాత రాత్రి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు ప్రధాని.
నేడు నగరానికి వీఐపీలు పర్యటించనున్న సందర్భంగా.. హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. వచ్చిన ప్రముఖులకు ఇబ్బందులు కలుగకుండా ఇవాళ, రేపు పలుచోట్ల వాహనాలను దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నగరానికి చేరుకున్న వీఐపీలు ప్రయాణించే ప్రధాన రోడ్డు మార్గాలైన మాదాపూర్, శంషాబాద్, ఖైరతాబాద్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. రెండు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Floating Solar Plant: ఎన్టీపీసీ రికార్డ్.. దేశంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం