Viral: కిలో తగ్గితే వెయ్యి కోట్లిస్తానని సవాల్.. బరువు తగ్గేందుకు ఎంపీ కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిట్‌నెస్ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ స్టార్ట్స్, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు భారీ కసరత్తులు ప్రారంభించారు ఎంపీ అనిల్ ఫిరోజియా.. బరువు తగ్గేందుకు ఆయన చేస్తున్న కసరత్తులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..
Read Also: Vallabhaneni: యార్లగడ్డవి రంగుల కలలు.. ఆయనదేమైనా మహేష్ బాబు ముఖమా..?
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిని లోక్‌సభ సభ్యుడు అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం ఆ మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే, ఎంపీ అనిల్ఫిరోజియాకి ఒక షరతు విధించారు గడ్కరీ.. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు మీరు బరువు తగ్గాలని.. అప్పుడే నిధులు మంజూరు చేస్తానంటూ ఓ షరతు పెట్టారు.. అంతేకాదు.. తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా ఈ సందర్భంగా గడ్కరీ వివరించారు.. గతంలో నేను 135 కిలోలు బరువు ఉంటే.. ప్రస్తుతం 93 కిలోలకి తగ్గానని తెలిపారు.. మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.. మీరు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తాననంటూ సవాల్ విసిరారు..
ఇక, అటు ఆరోగ్యం.. ఇటు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టారు ఎంపీ అనిల్ ఫిరోజియా.. బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకుని కసరత్తులు చేస్తున్నారు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నాటికి బరువు తగ్గి గడ్కరీని కలిసి మీ చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేస్తానని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఇప్పుడు మన ఎంపీగారు చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB
— Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?