ఓవైపు పెరిగిపోయిన పెట్రో ధరల నుంచి బయటపడేందుకు.. మరోవైపు వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా.. కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి.. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి రాగా… మరో కీలక అడుగు ఇవాళ ముందుకు పడినట్టు అయ్యింది.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును ఇవాళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.. కరోల్లా అల్టిస్ పేరిట టయోటా కంపెనీ రూపొందించిన ఈ కారును బ్రెజిల్ నుంచి ఆ సంస్థ భారత్‌కు తీసుకువచ్చింది.. ఈ తరహా ఇథనాల్ ఆధారిత కార్లను టయోటా సంస్థ బ్రెజిల్‌లో ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ.. విక్రయిస్తుండగా.. ఇవాళ ఢిల్లీలో ఆ కారును ప్రారంభించారు గడ్కరీ..
Read Also: Supreme Court: “తలాక్-ఎ-హసన్”పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
అయితే.. ఈ కారును 100 శాతం పెట్రోల్, 20 నుంచి 100 శాతం బ్లెండెడ్ ఇథనాల్‌తో పాటు విద్యుత్‌తోనూ నడిపే అవకాశం ఉంది.. అంటే.. ఒకేదానిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. మూడు విధాలుగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.. ఫ్లెక్సీ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఎఫ్ఎఫ్‌వీ-ఎస్‌హెచ్ఈవీ) రకానికి చెందిన సాంకేతికతను బ్రెజిల్‌లో డెవలప్‌చేసిన టయోటా సంస్థ.. ఇప్పుడు వాటిని ఇండియాకు తీసుకొస్తుంది.. కాలుష్యాన్ని తగ్గించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా.. 10 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వాడుతున్నారు. అయితే, మరో రెండు మూడేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వాడే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి..
ఫ్లెక్స్ ఫ్యూయల్-హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ పైలట్ ప్రాజెక్టును ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ లాంచ్ చేయగా.. పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తన మెసేజ్‌ను కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తెలియజేశారు. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్- హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.. ఈ వెహికిల్ 100 శాతం వరకు ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్‌తో నడుస్తుంది. పైలట్ ప్రాజెక్టు కోసం టయోటా బ్రెజిల్ నుంచి ఈ వాహనాన్ని దిగుమతి చేసింది.. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. కాలుష్యం పెద్ద సమస్యగా మారుతోంది.. దీనిలో రవాణా రంగం ద్వారా కాలుష్యం మరింత పెరిగిపోతోంది.. అయితే, పెరుగుతోన్న ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని, ఇథనాల్, మెథనాల్ వంటి బయోఫ్యూయల్స్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.. ఆత్మనిర్భర్ భారత్ కోసం వ్యవసాయ రంగ గ్రోత్ రేటును 6 శాతం నుంచి 8 శాతం పెంచాల్సినవసరం ఉందని కూడా ఉందన్నారు నితిన్ గడ్కారీ.