ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగానే గాయనీ గాయకులు పోటీ పడినట్టు ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే మార్చి 4, 5 తేదీలలో స్ట్రీమింగ్ అయిన 3వ ఎపిసోడ్ చూస్తే… కామెడీ ఎక్కువ కంటెంట్ తక్కువ అనే భావనే వీక్షకులకు కలిగింది. ఆహా నుండి వస్తున్న ఈ కార్యక్రమంలో గానం కంటే వినోదానికి పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తోంది. పైగా కంటెస్టెంట్స్ అందిస్తున్న వినోదం, మిఠాయిలు… న్యాయనిర్ణేతలను శాటిస్ ఫై చేస్తుండొచ్చు…
నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసిందీ మూవీ. ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తమ మనోభావాలను ఇలా తెలియచేశారు. హీరో నితిన్: ” ‘ఇష్క్’ నా కెరీర్‌లో మెమొరలబుల్ సినిమా. నటుడిగా నాకు రీ-బర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. పి. సి. శ్రీరామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్లాన్ కు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా…
‘అలా మొదలయ్యింది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యామీనన్.. సౌందర్య తరువాత సౌందర్య అని పేరుతెచ్చుకున్న ఈ భామ గ్లామరస్ రోల్స్ కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే కనిపించి మెప్పించింది. ఇటీవలే నిర్మాతగా మారి స్కైలాబ్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నిత్యా ప్రస్తుతం భీమ్లా నాయక్ లో పవన్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను…
టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక…
ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదు. తాజాగా నాని మరోసారి టికెట్ రేట్లపై కౌంటర్ వేశారు. నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన ‘స్కైలాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు చెబుతూ, ”బండ లింగపల్లిలో ఓ ధనవంతురాలి బిడ్డ గౌరి. జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం అనే పత్రికకు వార్తలు సేకరించి పంపుతూ ఉంటుంది. డాక్టర్ ఆనంద్ తన గ్రామంలో…