టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోంది .
” నా అంతట నేనుగా ఎవరి దగ్గరకు వెళ్లి అవకాశాల కోసం నిలబడను.. ఆ పాత్రకు నేను సరిపోతాను.. అని అనుకున్నవారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు. ‘భీమ్లా నాయక్’ కూడా నాకు అలా వచ్చిందే.. త్రివిక్రమ్ నాకు ముందు నుంచి తెలుసు .. ఆయన నన్ను ఒక రౌడీ అమ్మాయిలా చూస్తాడు.. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అలాంటి పాత్రను డిజైన్ చేశారు.. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ లో కూడా నేను రౌడీ అమ్మాయిలనే కనిపిస్తాను” అని చెప్పుకొచ్చింది. ఒరిజినల్ వెర్షన్ లో నిత్యా పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు.. కానీ తెలుగులో ఆమె పాత్రను కొద్దిగా పొడిగించి , కథకు ప్రాధాన్యమున్న పాత్రగా మలిచారు దర్శకుడు.. అందుకే ఈ పాత్రకు నిత్యా ఒప్పుకున్నట్లు సమాచారం. జనవరి 12 న భీమ్లా నాయక్ విడుదల కానుంది. మరి ఈ సినిమా నిత్యాకు ఎలాంటి పేరును తీసుకువస్తుందో చూడాలి.