నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసిందీ మూవీ. ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తమ మనోభావాలను ఇలా తెలియచేశారు.
హీరో నితిన్: ” ‘ఇష్క్’ నా కెరీర్‌లో మెమొరలబుల్ సినిమా. నటుడిగా నాకు రీ-బర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. పి. సి. శ్రీరామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఈ సినిమా స్పెషల్‌గా రావడానికి కారణం కథ, కథనం, దర్శకత్వం, పి.సి. శ్రీరామ్ విజువల్స్, అనూప్ మంచి సంగీతం ఇచ్చారు. నాది, నిత్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ డ్రీమ్ టీమ్‌తో మరోసారి సినిమా చేయాలని కోరుకుంటున్నాను”.
నిత్యామీనన్: ” ‘ఇష్క్’ నా సెకండ్ మూవీ. నా హృదయాన్ని టచ్ చేసిన సినిమా. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళినా ప్రియా ప్రియా సాంగ్ పాడమని అడుగుతుంటారు. అనూప్ నాచేత ఆ పాట పాడించారు. మొదటి పేమెంట్ కూడా తీసుకున్నాను. విక్రమ్ కుమార్ గారు క్యూట్ ఫిలింగా తీశారు. నాకు చాలా ఆనందంగా వుంది. అప్పుడే దశాబ్దం అయిందా! అనిపించింది. అందరం వేరే వేరే చోట వుండడంతో సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం. త్వరలో కలుస్తాం”.
Read Also : Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు!
డైరెక్టర్ విక్రమ్ కె కుమార్: ”’ఇష్క్’ వచ్చి అప్పుడే పదేళ్ళు అని నమ్మలేకపోతున్నాను. నిత్య, నితిన్ కెమిస్ట్రీ బాగా పండింది. పి.సి. శ్రీరామ్ విజువల్ వండర్ ఇచ్చారు. ఫ్రెష్‌గా చూపించారు. ఇక సంగీతం అనూప్ ఫెంటాస్టిక్‌గా ఇచ్చాడు. `ప్రియా.., చిన్నదానా నీకోసం, సూటిగా.., ఏదో ఏదో..’ అనే పాటలు ఆహ్లాదకరమైన ఆడియోగా పేరు తెచ్చుకున్నాయి. నా లైఫ్‌లో ఈ సినిమా రీ ఎంట్రీ అనుకోవచ్చు. ఇంత ముఖ్యమైన సినిమాను నాకు ఇచ్చినందుకు నితిన్, సుధాకర్ రెడ్డికి ధన్యవాదాలు. వారు నాపై నమ్మకాన్ని వుంచారు. నా లైఫ్‌ను ‘ఇష్క్’ సినిమా మార్చేసింది”.
అనూప్ రూబెన్స్: ”అప్పుడే పదేళ్ళు అయిపోయాయా! అనిపిస్తుంది. మూవీ లవర్స్ మంచి సినిమా ఇచ్చారు. మా అందరికీ స్పెషల్ మూవీ. ఈ సినిమా బాగా రావడానికి కారకులైన పి. సి. శ్రీరామ్, విక్రమ్ కుమార్‌కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నితిన్, సుధాకర్ రెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్” .
పి. సి. శ్రీరామ్: ”పదేళ్ళు ‘ఇష్క్’ సినిమాకు వచ్చేశాయా అనే ఆశ్చర్యం కలిగింది. దర్శకుడు విక్రమ్ ఏదైతే నా నుంచి కోరాడో అది వంద శాతం ఇచ్చాను. దానికి నిత్య, నితిన్ నటన హైలైట్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. రెండు చేతులు కలిపితే మేజిక్ అయినట్లు నిత్య, నితిన్ కెమెస్ట్రీతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం మాయ చేసింది. ఈ మేజిక్ ఇచ్చేలా చేసిన సుధాకర్ రెడ్డిగారికి, నితిన్, విక్రమ్ కుమార్‌గారికి ధన్యవాదాలు”.
It’s so overwhelming as I think that it’s been 10 years of this beautiful movie #Ishq. The credits go to my director @vikramkkumar @pcsreeram sir @anuprubens and my costar @nithyamenen and all the cast and crew. Thanking each and everyone for all the love towards the movie! 🤗🤗 pic.twitter.com/LK4wxsKQpc
— nithiin (@actor_nithiin) February 24, 2022