Macherla Niyojakavargam First Attack మొదలైంది. ఇక మాచర్ల మాస్ స్టార్ట్… యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం “మాచర్ల నియోజకవర్గం” టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. Macherla Niyojakavargam First Attack అంటూ విడుదల చేసిన ఈ టీజర్లోనే సినిమా విడుదల తేదీని…
(మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు)నితిన్ చిత్రసీమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగడం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్.అదే నితిన్ బాణీ అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్ ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలోనే వరుస విజయాలు చవిచూసిన నితిన్ కు ఆ తరువాత సక్సెస్ దూరంగా జరిగింది.…
యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్…
యంగ్ హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయనున్న సినిమా “పవర్ పేట” అంటూ ప్రచారం జరిగింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కు గీత రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్యతో చర్చలు జరిపాడు నితిన్. కానీ తెలియని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు…
Macherla Niyojakavargam నుంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. కొన్ని రోజుల క్రితం ‘మాస్ట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు Macherla Niyojakavargamతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని…
యంగ్ హీరో నితిన్ కు ‘భీష్మ’ తరువాత అంతటి హిట్ పడలేదని చెప్పాలి. నితిన్ నటించిన గత మూడు చిత్రాలు చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు పడింది. అది కూడా టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో ! Read Also : Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్…
నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసిందీ మూవీ. ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తమ మనోభావాలను ఇలా తెలియచేశారు. హీరో నితిన్: ” ‘ఇష్క్’ నా కెరీర్లో మెమొరలబుల్ సినిమా. నటుడిగా నాకు రీ-బర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. పి. సి. శ్రీరామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఈ సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన భార్యపై చేసిన ‘నెగెటివ్’ కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నితిన్ తన తాజా పోస్ట్ లో కేక్ కోస్తూ మొదటిసారి తన భార్య నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నితిన్ కింద కేక్ కోస్తూ ఉండగా, ఆయన భార్య పైన ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. అలా ఎందుకంటే నితిన్ భార్యకు కరోనా పాజిటివ్ గా…
యంగ్ హీరో నితిన్ కు ఈ యేడాది ఏమంతగా అచ్చిరాలేదు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోక పోవడం వల్ల అతని సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అది కూడా వీక్షకులను పెద్దంత మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమౌతున్న…
యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచాడు. ‘మాస్ట్రో’ చిత్రం కొద్దిగా నిరాశపరచడంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది.…