టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేడు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. రీమేక్ చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇదిలావుంటే, నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకోగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. అయితే మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించి…
ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ చిత్రం…
థియేటర్లు రీఓపెన్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ముందుగా చిన్న సినిమాల నిర్మాతలు ధైర్యం చేసి అడుగు ముందుకేశారు. అంతగా ఫలితం రాలేదు. కానీ రానురానూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెమ్మదిగా మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో అసలు ప్రచారమే జరగని సినిమాలు ఉన్నాయి. భారీగా అంచనాలు ఉన్న సినిమాలూ విడుదల అయ్యాయి. సత్యదేవ్ “తిమ్మరుసు”, తేజ సజ్జ “ఇష్క్” తదితర సినిమాలు రిలీజ్ అయ్యాయి.…
హీరో నితిన్ నటించిన ‘మాస్ట్రో’ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది.. ప్రమోషన్ లో భాగంగానే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో నితిన్ మాట్లాడుతూ రీమేక్ కష్టాలను పంచుకున్నారు. అంధాదున్ సినిమా బాగా నచ్చింది. నటనకు స్కోప్ ఉన్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవాలి అనిపించింది. దర్శకుడు మేర్లపాక గాంధీ దీనికి కరెక్ట్ డైరెక్టర్ గా భావించాను. ఈ సినిమాకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఉన్నది…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. వినాయక చవితి శుభ ముహూర్తాన సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టితో రొమాన్స్ చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం, ప్రసాద్…
బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన ‘అంధదూన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘మాస్ట్రో’ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్ లో నితిన్ అంధుడిగా అదరగొట్టగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘లా…
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. కెరీర్ ప్రారంభం నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ, సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. వరుసగా స్టార్ హీరోలకు దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో “సైరా” అనిపించినా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక స్పై థ్రిల్లర్ కథాంశాన్ని తీసుకుని అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు.…
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 9న ఈ…
ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’…