యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి కొత్త జానర్‌లలో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా నితిన్ మరో సినిమాను ప్రారంభించాడు. యంగ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న “Nithiin32” మూవీ లాంచ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తం షాట్‌కు పుస్కూర్ రామ్‌మోహన్‌రావు క్లాప్ కొత్తగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, ఠాగూర్ మధు స్క్రిప్ట్‌ను అందజేశారు.
Read Also : Telugu Indian Idol : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే….
ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్న నితిన్ కోసం పక్కా కమర్షియల్ సబ్జెక్ట్‌ని రాసుకున్నాడు. ఈ సినిమా కోసం కొంతమంది ప్రముఖ టెక్నీషియన్స్ పని చేయనున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నెం 9లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. కాగా “మాచర్ల నిజోజకవర్గం”లో ఇటీవలే పవర్ ఫుల్ లుక్ లో కన్పించిన నితిన్ అభిమానులను ఆకట్టుకోగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా పూర్తి చేసిన తర్వాత నితిన్ ఈ మూవీని ప్రారంభించనున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.