యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఐఏఎస్ అధికారిగా నితిన్ ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నాడు.
Read Also : Sukumar: ‘పుష్ప 3’ కూడా ఉన్నదట..?
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన ఈ అధికారి కథను ‘మాచర్ల నియోజకవర్గం’లో చూడబోతున్నాము. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే… నితిన్ సీరియస్ గా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. నితిన్‌ను మునుపెన్నడూ చూడని మాస్, కఠినమైన అవతార్‌లో ఈ ఫస్ట్ లుక్ ప్రెజెంట్ చేసింది. ఆయన గెటప్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంది. మొత్తానికి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ తో నితిన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.