India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్‌పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్‌ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
Nitesh Rane: మహారాష్ట్రలో జాతీయ విద్య విధానం(ఎన్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లీష్‌తో పాటు హిందీని తప్పనిసరి చేయడాన్ని రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదమే, ఇప్పుడు మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలకు కారణమవుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో…
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.
మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitesh Rane : బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తన వివాదాస్పద ప్రకటనతో మరోసారి వెలుగులోకి వచ్చారు. నవీ ముంబైలో జరిగిన గణపతి పండుగ కార్యక్రమంలో మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి నితీశ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.