సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు.
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు.…
17వ లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి (జనవరి 31)నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేటి ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది.
Budget 2024 : పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యాధులకు చికిత్స పొందడం చాలా కష్టంగా మారుతోంది. ఇటీవల పాలసీ బజార్ ఒక డేటాను విడుదల చేసింది. అందులో గత ఐదేళ్లలో చిన్న వ్యాధుల చికిత్సకు కూడా ఖర్చు రెట్టింపు అయ్యింది.
Direct Listing : గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి) అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్లో భారతీయ కంపెనీల సెక్యూరిటీల ప్రత్యక్ష జాబితాను భారత ప్రభుత్వం ఆమోదించింది.
Budget 2024 : దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల పాటు 'లాక్'లోనే ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన చాలా మంది అధికారులు ఇప్పుడు దేశ బడ్జెట్‌ను సమర్పించే వరకు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే ఉంటారు.
Budget 2024: ప్రతి బడ్జెట్లో ఉద్యోగస్తులకు అంచనాలు ఉంటాయి. ప్రతి జీత తరగతి ప్రజలు వారి రోజువారీ జీతంతో వారి నెలవారీ ఖర్చులను తీర్చుకోవడం సవాలుగా ఉంది.
Nirmala Sitharaman: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశం సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారంటూ ఆరోపించారు. స్థానిక మీడియ కథనాన్ని ఉటంకిస్తూ.. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Budget 2024 : బడ్జెట్‌కి సంబంధించి వివిధ రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ 2024 తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి.