గురువారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒకెత్తు అయితే.. లక్షద్వీప్‌పై ఆమె చేసిన ప్రకటన మరొకెత్తు. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా స్పెషల్‌గా ఫోకస్ అయ్యాయి.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యంతర బడ్జెట్‌ను దేశ ప్రజల ముందు ఉంచారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తన ప్రసంగంలో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని అందజేస్తామని తెలిపింది.
మధ్యంతర బడ్జెట్ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి కేంద్ర సర్కార్ అనేక కీలక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Budget 2024 : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రికి ఇది ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వం రెండవ దఫాలో చివరి బడ్జెట్.
Budget 2024 : దేశ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె చెప్పారు.