మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తన ప్రసంగంలో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని అందజేస్తామని తెలిపింది. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ రాష్ట్రాలలో సంస్కరణలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అవసరం.. ఈ దిశగా తమ సర్కార్ ముందుకు సాగుతుందని పేర్కొన్నింది. రాష్ట్రాలను ఆదుకోవడానికి వడ్డీ రహిత రుణాన్ని ఈ సంవత్సరం ప్రతిపాదించాం.. ఇది రాష్ట్రాల పరిస్థితిని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుందని సీతారామన్ చెప్పుకొచ్చింది. ఈ ఏడాది కూడా రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న సహకారం కొనసాగుతుందని వెల్లడించారు.
Read Also: Suhaas: చిన్న సినిమాకి ఈరోజు హిట్ టాక్ పడుతుందా?
అయితే, గత ఏడాది బడ్జెట్ లో మూలధన పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకాన్ని ప్రకటించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం కింద 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా మొత్తం 1.3 లక్షల కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆమె ప్రకటించింది. ఇక, ఈ పథకం కింద 16 రాష్ట్రాలకు 56,415 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇప్పుడు ఈ ఏడాదికి రూ.75,000 కోట్లు కేటాయించాం.. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, వంతెనలతో పాటు రైల్వేలతో సహా వివిధ రంగాలలో మూలధన పెట్టుబడి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ఫైనాన్సింగ్ రాష్ట్రాలకు సహాయపడుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది.