తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో స్థానికులకు వణుకు పుట్టిస్తున్నాయి. వరుసగా కురిసిన వానలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ పట్టణమైతే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
Read Also: Andhrapradesh: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
అటు కడెం ప్రాజెక్టు పరిస్థితి అయితే డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ప్రాజెక్టుకు ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో వస్తోంది. కడెం ప్రాజెక్టు అసలు సామర్థ్యం 3. 50 లక్షల క్యూసెక్కులుగా కాగా.. ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులోని 16 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే మరో రెండు గేట్లు మాత్రం మొరాయించాయి. ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వైపు ఎవరినీ అనుమతించడం లేదు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: Deva Katta : ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న దర్శకుడు దేవకట్టా..?
అయితే, కడెం ప్రాజెక్ట్ కు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో గేట్ల పై నుంచి వరద నీరు వెళ్తుంది. దీంతో.. లక్ష 40 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరుకుంటుంది. దీంతో అధికారులు ఇప్పటికే అతి కష్టం మీద రెండు గేట్లను ఎత్తివేశారు. మొత్తం 18 గేట్లు ఉండగా అందులో 16 గేట్లు ఎత్తివేయగా.. ఇంకా రెండు గేట్లు తెరుచు కోలేదు.. ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో 2 లక్షల 33 వేల 506 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Andhrapradesh: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ
కడెం ప్రాజెక్టు కు చెందిన మరో రెండు గేట్లు ఎత్తడం కోసం ప్రాజెక్ట్ వద్దకు నిపుణుల టీం చేరుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన టెక్నికల్ టీం.. కౌంటర్ వెయిట్ లేని ఆ రెండు గేట్లను ఎలా పైకి లేపాలి అనే దాన్ని ఎస్ఈ స్థాయి అధికారి పరిశీలిస్తున్నారు. చైన్ పుల్లింగ్ ద్వారా ఎత్తాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు.. ఉండగా.. ఇప్పటి వరకు 16 గేట్లు ఎత్తివేశారు. మరో రెండు గేట్లను సైతం పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు..