Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో ముగ్గురు మృతి చెందారు.
KTR : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీలు శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసి తిరిగే సమయంలో ఆర్మూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్, మృతుల తండ్రి బాణావత్ రెడ్డి ఉపాధి నిమిత్తం…
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం…
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
Nirmal: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు.
Ponguleti Srinivas Reddy : నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు.
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.