Governor tamilisai soundararajan visits basara iiit campus: బాసర ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి సైని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా పరీక్షించేందుకు నిర్మల్ జిల్లా బాసరకు శనివారం (నిన్న)…
Governor Tamilisai to meet Basara IIIT students: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి…
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. 64 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరుని…
నిర్మల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే…
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని బాగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు జిల్లాలో కలకలం రేపింది. గుప్తనిధుల కొరకు దేవతామూర్తి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ పూజారి సోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గుప్తనిధుల కోసమే విగ్రహాల ధ్వంసం చేసినట్లు తెలుస్తుందని ఎస్సై పేర్కొన్నారు.