Palanje Ganesh Temple: దేశంలో ఎక్కడ చూసినా వినాయక నిమజ్జన కార్యక్రమాల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. వినాయక చవితి రోజున తమకు నచ్చిన గణేశుడి ప్రతిమను పూజించి, తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి, ఇప్పుడు ఆ వినాయకుడిని చెరువులు, సరస్సుల్లో మళ్లీ రా గణపయ్య వెళ్లిరా గణపయ్య అంటూ సాగనంపుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాల సందడి నెలకొందని చెప్పాలి. ఇది ఎన్నో రోజులుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ అని చెప్పాలి. గణేశుడిని ఇలా నీటిలో నిమజ్జనం చేయడం ఇష్టం లేకపోయినా చాలా మంది బాధతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిన విషయాలే.. కానీ.. ఓ ఊరిలో వినాయకుడిని నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచుతారు. అలా చేస్తే అది సంప్రదాయానికి విరుద్ధం.
తొమ్మిది రోజులు పూజ చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ అయితే.. ఇక్కడ మాత్రం నిమజ్జనం చేయకుండా అలాగే విగ్రహాన్ని ఉంచడం అనవాయితీ వస్తుంది. ఇలా గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా భద్రపరుస్తున్నారు. ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి సమీపంలోని పాలాజ్ లో కర్ర గణేశుడు కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం చవితికి బీరువాలో ఉంచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరి రోజున గణేశుడి విగ్రహాన్ని వాగుకు తీసుకొచ్చి నీళ్లు చల్లి మళ్లీ తీసుకుని వెళ్లి బీరువాలో ఉంచుతారు. ఈవిధంగా 75 ఏళ్లుగా గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ప్రతి సంవత్సరం భద్రపరిచి ప్రతిష్ఠిస్తున్నారు. ఇలా చేయడం సంప్రదాయంగా ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. వినాయకునిడి నిమజ్జనం చేయడం అరిస్టమని చెబుతున్నారు. గత 75ఏళ్లుగా ఇలానే ఆచారాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు వేరే ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్థానికులు అంటున్నారు.
Kolkata Doctor Rape Case: జూనియర్ డాక్టర్ కేసులో మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారికి సీబీఐ కస్టడీ పొడిగింపు