KTR : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీలు శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసి తిరిగే సమయంలో ఆర్మూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్, మృతుల తండ్రి బాణావత్ రెడ్డి ఉపాధి నిమిత్తం మలేషియాలో ఉండటాన్ని గమనించి, వెంటనే ఆయనను తెలంగాణకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
Bhatti Vikramarka : కేంద్ర కులగణన ప్రకటనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అర్థరాత్రి దాకా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల మేనమామ కుటుంబానికి అండగా నిలిచి, వైద్యులు, అధికారులు, పోలీసులతో సమన్వయం చేసి మరణాంతర ప్రక్రియను వేగవంతం చేశారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ ద్వారా స్వగ్రామం లోతేర తండాకు తరలించి, అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
MS Dhoni: “ధోనీ ఆలోచన అదే”.. రిట్మైర్మెంట్‌పై సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయిన మంజుల, అశ్వినీలు భవిష్యత్తులో ఎంతో సాధించగలిగే విద్యార్థినులు అని, వారి మృతి తీరనిగాయమన్నారు. విదేశాల్లో ఉన్న తండ్రిని వెంటనే రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ తక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు.